Disney Plus Hotstar: రామ్ చరణ్ క్రేజ్ ని ఉపయోగించుకోలేక పోతున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్

Disney Plus Hotstar: రామ్ చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి ఉపయోగం ఏంటి అంటున్న నెటిజన్లు

admin1
Updated on: 23 Nov 2021 5:41 PM IST
Disney Plus Hotstar Cant Utilize the use the Ram Charan Craze
X

రామ్ చరణ్ (ఫైల్ ఇమేజ్)

Brand Ambassador of Disney Plus Hotstar in India - Ram Charan: ఈ మధ్యనే ప్రముఖ ఓటీటీ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ హాట్ స్టార్ యాడ్ లో ఒక కొత్త లుక్ తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ చూస్తూ ఉంటే చెర్రీ క్రేజ్ ను డిస్నీ వారు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవటం లేదేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "అద్భుతం" అనే ఒక తెలుగు సినిమాని విడుదల చేసింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది.

సినిమా విడుదలకు ముందు కానీ విడుదలైన తర్వాత గాని హాట్స్టార్ లో ఏ మాత్రం హడావిడి లేదు. కనీసం సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్ అయినా పెట్టి దానికి రామ్ చరణ్ ని ముఖ్యఅతిథిగా పిలిచి ఉంటే సినిమాకి కొంచెం అయినా క్రేజ్ వచ్చేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కనీసం రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా గురించి ఒక పోస్ట్ చేసిన బావుండేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇచ్చి రామ్ చరణ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా మార్చుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన క్రేజ్ ను ఏమాత్రం ఉపయోగించుకోవటం లేదని నెటిజన్లు భావిస్తున్నారు.

admin1

admin1

Next Story