డైరెక్టర్ ని అడిగి మరీ అల్లు అర్జున్ సన్నివేశం పెట్టించిన హీరోయిన్

Disha Patani: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో కూడా బాగానే క్రేజ్ ఉన్న సంగతి తెలిసింది.

Arun Chilukuri
Published on: 23 July 2022 4:35 PM IST
Disha Patani Pushed Director For Allu Arjun Scene?
X

డైరెక్టర్ ని అడిగి మరీ అల్లు అర్జున్ సన్నివేశం పెట్టించిన హీరోయిన్

Disha Patani: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో కూడా బాగానే క్రేజ్ ఉన్న సంగతి తెలిసింది. ఈ మధ్యనే పెద్దగా ప్రమోషన్లు లేకుండానే విడుదలైన "పుష్ప" సినిమా బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా ఇప్పుడు ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తన సినిమాలో అల్లు అర్జున్ సన్నివేశం ఉండేలాగా చూసుకుందట. ఆమె మరెవరో కాదు దిశా పటాని.

తెలుగులో వరుణ్ తేజ్ సరసన "లోఫర్" సినిమాలో కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో "ఏక్ విలన్ రిటర్న్స్" అనే సినిమాలో నటిస్తోంది. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, ఆదిత్య రాయి కపూర్ మరియు తారాసుతారియా లు కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జులై 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో జాన్ అబ్రహం మరియు దిశ ఒక థియేటర్ కి వెళ్తారు.

ఆ థియేటర్లో "అల వైకుంఠపురం లో" సినిమా రన్ అవుతూ ఉంటుంది. నిజానికి "అల వైకుంఠపురం లో" సినిమా హిందీలో కూడా రీమేక్ అవుతోంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. దీంతో దిశా పటానీ అల్లు అర్జున్ కనిపించేలాగా "అల వైకుంఠపురం లో" సినిమా విజువల్స్ పెట్టమని దర్శకుడిని కోరిందట. దర్శకుడు మోహిత్ సూరి కూడా సినిమాలో అల్లు అర్జున్ విజువల్స్ ని వాడినట్లు సమాచారం. సినిమాలో ఈ విజువల్స్ చూడటానికి కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story