Kalki 2898 AD: ప్రభాస్‌ని ఫోటో తీస్తున్న దిశాపటానీ.. ‘కల్కి 2898 ఏడీ’ బీటీఎస్‌..

Kalki 2898 AD: ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’.

Shekhar G
Updated on: 7 March 2024 5:00 PM IST
Disha Patani Photographing Prabhas Photo Goes Viral
X

Kalki 2898 AD: ప్రభాస్‌ని ఫోటో తీస్తున్న దిశాపటానీ.. ‘కల్కి 2898 ఏడీ’ బీటీఎస్‌.. 

Kalki 2898 AD: ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభ‌మై 2898 సంవ‌త్స‌రంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఐతే ప్రభాస్ ఇంకా దిశాపటానీపై వచ్చే రొమాంటిక్ సాంగ్ తీయడానికి మూవీ టీం ఇటలీలోని ఓ ఐలాండ్‌ కి వెళ్లారు. ఇక ఆ షూటింగ్ సెట్స్ నుంచి మూవీ టీం, టెక్నికల్ వర్కింగ్ ఫోటోలు కొన్ని వచ్చి ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా మూవీ టీం సోషల్ మీడియా లో ఆసక్తికర ఫోటోని పోస్ట్ చేసింది. ఫ్లైట్‌లో వెళ్ళ్తునా సమయం లో ప్ర‌భాస్‌ను దిశాపటానీ ఫొటో తీసింది. ఇక దిశా ఈ ఫొటో తీస్తున్న సమయంలో తీసిన ఫోటోని కల్కి టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ స్టిల్ నెట్టింట‌ ఫుల్ వైర‌ల్‌గా మారింది.


Shekhar G

Shekhar G

Next Story