దిశా సినిమాను అడ్డుకోండి.. హైకోర్టుని ఆశ్రయించిన దిశా తండ్రి!

దిశా సినిమాను అడ్డుకోండి.. హైకోర్టుని ఆశ్రయించిన దిశా తండ్రి!
x

Disha

Highlights

Disha Encounter Movie : దిశా సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన సాముహిక అత్యాచారాన్ని ఆధారంగా చేసుకొని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Disha Encounter Movie : దిశా సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన సాముహిక అత్యాచారాన్ని ఆధారంగా చేసుకొని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు వర్మ.

అయితే ఈ సినిమాని కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు ఆపాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అయన కోర్టులో పిటిషన్‌లను కూడా దాఖలు చేశారు. హత్యాచార ఘటన,నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని అయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు.

అయితే ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ ఎలాంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరపు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌ రావు పేర్కొన్నారు. అయితే దీనిపైన స్పందించిన న్యాయమూర్తి బాధిత యువతి తండ్రి ఇచ్చే వినతిపత్రంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, సెన్సార్ బోర్డును ఆదేశించారు.

ఇక ఈ సినిమాని నవంబర్ 26, 2020 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ..ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే.. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories