"ఆర్ అర్ ఆర్" గురించి రాజమౌళి ఫ్యామిలీ గ్రూప్లో డిస్కషన్

*"ఆర్ అర్ ఆర్" గురించి రాజమౌళి ఫ్యామిలీ గ్రూప్లో డిస్కషన్

admin1
Updated on: 28 March 2022 11:44 AM IST
Discussion on RRR Movie in Rajamouli Family Group | Tollywood
X

"ఆర్ అర్ ఆర్" గురించి రాజమౌళి ఫ్యామిలీ గ్రూప్లో డిస్కషన్ 

Rajamouli Family Group: బాహుబలి ఫ్రాంచైస్ తరువాత టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా "ఆర్ అర్ ఆర్". మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రం రెండు సార్లు వాయిదా పడి థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విడుదల అయింది కాబట్టి వాట్సాప్ లో తన ఫామిలీ గ్రూప్ లో ఈ సినిమా గురించిన డిస్కషన్ మొదలైందని అన్నారు రాజమౌళి. ఆ గ్రూప్లో దగ్గర దగ్గర 41 మంది ఉంటారట.

సినిమా విడుదలైన దగ్గర నుంచి టికెట్ల కోసం రిక్వెస్ట్ లేక మూవీ రివ్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటారని అన్నారు రాజమౌళి. అయితే టికెట్లు కావాల్సిన అవసరం అంతగా రాదని ఎందుకంటే తన భార్య రమా రాజమౌళి కుటుంబం మొత్తానికి టికెట్లు మొదటిరోజే ఇస్తారని అన్నారు. ప్రస్తుతం "ఆర్ అర్ ఆర్" గురించి తమ గ్రూప్లో డిస్కషన్ జరుగుతుందట.

ఇక ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అవడంతో రాజమౌళి తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్లాలని తిరిగి వచ్చిన తర్వాత తన తదుపరి సినిమా గురించి ఆలోచించాలని అన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒక 15 రోజుల పాటు తన కుటుంబంతో యూరోప్ కి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతోందని తెలిసిందే.

admin1

admin1

Next Story