Ram Charan: రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో కనిపించి షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఈ ఇద్దరు డైరెక్టర్లు ఎందుకు వచ్చారు?

Dhatripriya
Published on: 29 March 2023 11:56 AM IST
Directors Gave Shock By Attending Ram Charan Birthday Celebrations
X

Ram Charan: రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో కనిపించి షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు

Ram Charan: మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటిలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. చాలా వరకు ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రిటీలు అందరూ ఈ పార్టీలో పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్ మరియు డివివి ఎంటర్టైన్మెంట్ వారు సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు విడుదల చేసి రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ పోస్టర్లపై డైరెక్టర్ పేర్లు లేకపోవడంతో ఇంకా డైరెక్టర్లు ఖరారు కాలేదని కానీ సినిమా మాత్రం ఫైనలైజ్ అయిందని తెలుస్తోంది.

కానీ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో కనిపించడంతో ఇప్పుడు మరికొన్ని పుకార్లు మొదలయ్యాయి. ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ చెర్రీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక మరొక కన్నడ డైరెక్టర్ నార్తన్ కూడా ఒక నిర్మాతతో పాటు ఈ వేడుకలు పాల్గొన్నారు. గతంలో ఇద్దరు డైరెక్టర్లతో రామ్ చరణ్ సినిమాలు ఉంటాయని అనుకున్నారు కానీ ఈ రెండు ప్రాజెక్టులు అటకెక్కాయి.

కానీ ఇప్పుడు వీరిద్దరూ రామ్ చరణ్ పుట్టిన రోజు పార్టీలో కనిపించడంతో ఈ ఇద్దరు డైరెక్టర్లు రామ్ చరణ్ తో సినిమాలు చేయబోతున్నారు అని వార్తలు మొదలయ్యాయి. ఇక ఈ డైరెక్టర్లతోపాటు అక్కినేని కుటుంబం, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి, కాజల్, అడవి శేష్, తదితరులు కూడా చెర్రీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story