దర్శక నిర్మాతలను కన్ఫ్యూజన్ లో పడేసిన పవన్ కళ్యాణ్

* ఒకసారి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైంది అంటే పవన్ కళ్యాణ్ మళ్ళి తిరిగి షూటింగ్ కి అంత తొందరలో రాలేరు.

R Tripura Malini
Published on: 10 Dec 2022 6:55 AM IST
Directors And Producers Waiting For Pawan Kalyan
X

దర్శక నిర్మాతలను కన్ఫ్యూజన్ లో పడేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వీటిని ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమా పూర్తన తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అంతేకాకుండా "సాహో" ఫేమ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేశారు పవన్ కళ్యాణ్.

కానీ హరీష్ శంకర్ మరియు సుజిత్ లతో పవన్ కళ్యాణ్ చేయబోతున్న సినిమా షూటింగులు ఎప్పుడు మొదలవుతాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మారింది. మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే జనవరిలో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం బస్సు టూర్ ను ప్రకటించారు. ఒకసారి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైంది అంటే పవన్ కళ్యాణ్ మళ్ళి తిరిగి షూటింగ్ కి అంత తొందరలో రాలేరు. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకి డేట్లు ఇవ్వగలరా లేదా అని నిర్మాతలు మరియు డైరెక్టర్లు కన్ఫ్యూషన్ లో ఉన్నారు.

ప్రస్తుతం జనసేన అధినేతగా అటువైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ పైన దృష్టి పెట్టారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తయితే తప్ప నెక్స్ట్ సినిమాల గురించి అప్డేట్స్ బయటికి రావు. మరోవైపు పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం డైరెక్టర్లు మరియు నిర్మాతలు ఇంకా ఎన్ని నెలలు ఎదురు చూడాల్సి వస్తుందో చూడాలి.

R Tripura Malini

R Tripura Malini

Next Story