Pooja Hegde: త్రివిక్రమ్ కోసం డేట్స్ ఎడ్జస్ట్ చేసుకున్న పూజ హెగ్డే

Pooja Hegde: పూజా హెగ్డే కోసం ఎక్స్ట్రా బెనిఫిట్లు ఇస్తున్నా దర్శక నిర్మాతలు

admin1
Updated on: 13 Aug 2021 5:00 PM IST
Directors And Producers Gives Extra Benefits to Pooja Hegde
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేసిన పూజ హెగ్డే (ఫైల్ ఇమేజ్)

Pooja Hegde: ప్రస్తుతం "సర్కార్ వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా పూజా హెగ్డే మరియు మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా. అంతేకాక "అతడు", "ఖలేజా" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిజానికి ఈ సినిమాలో నటించేందుకు పూజాహెగ్డే వద్ద డేట్లు ఖాళీ లేవట. కానీ "అరవింద సమేత", "అల వైకుంఠ పురం లో" వంటి సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా మిస్ చేసుకోలేక పూజ హెగ్డే స్వయంగా తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరీ ఈ సినిమాకి సైన్ చేసిందట. అయితే అందువల్ల ఈ సినిమా లో పూజ హెగ్డే లోకి బోలెడు ఎక్స్ట్రా బెనిఫిట్ లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే ఒక సినిమాకి 2.5 కోట్లు మాత్రమే ఛార్జ్ చేస్తుంది కానీ ఈ సినిమా నిర్మాతలు మాత్రం పూజా హెగ్డే కి దాదాపు మూడు కోట్ల వరకు ఇస్తున్నట్లు సమాచారం. హారిక మరియు హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story