ఆ సినిమా చూసి బాలకృష్ణ భార్య వసుంధర మెచ్చుకున్నారు!

Vinayak About Chennakesava Reddy : వివి వినాయక్... మంచి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు.. హీరోలని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించే గడ్స్ ఉన్న డైరెక్టర్.. అందుకే విజయాల వినాయక్ అయ్యారు అయన.. ఇప్పటి వరకూ 17 సినిమాలు చేసి టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచారు వినాయక్..

Krishna
Published on: 22 Oct 2020 2:31 PM IST
ఆ సినిమా చూసి బాలకృష్ణ భార్య వసుంధర మెచ్చుకున్నారు!
X

Vinayak About Chennakesava Reddy : వివి వినాయక్... మంచి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు.. హీరోలని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించే గడ్స్ ఉన్న డైరెక్టర్.. అందుకే విజయాల వినాయక్ అయ్యారు అయన.. ఇప్పటి వరకూ 17 సినిమాలు చేసి టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచారు వినాయక్.. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వినాయక్ తన సినీ కెరియర్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూలో వినాయక్ బాలకృష్ణతో చేసిన చెన్నకేశవరెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడిగా బాలకృష్ణ తనకి మంచి మర్యాద ఇచ్చారని వినాయక్ వెల్లడించాడు. చెప్పింది చాలా మర్యాదగా వింటూ కష్టమైన సన్నివేశాలను చాలా మొండిగా బాలకృష్ణ చేసేవారని వినాయక్ తెలిపారు. ఇక ఈ సినిమాలో భూమిలో నుంచి సుమోలు పైకి లేచే సన్నివేశాన్ని తాము రెండు రోజులలో తీశామని అన్నారు. ఈ మేకింగ్ చాలా మంది హీరోలకి చాలా నచ్చిందని, తనని స్టార్ హీరోలతో సినిమాలను చేసేందుకు ఈ సన్నివేశాలు తనకి ఎంతో ఉపయోగపడ్డాయని వినాయక్ చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమాలో తానూ సస్పెన్స్‌ అనుకున్నది కన్ఫ్యూజన్‌ అయిందని, ఈ సినిమాని పలు సినిమాలతో ప్రేక్షకులు పోల్చినప్పటికి అవన్నీ వేర్వేరు అంటూ వినాయక్ తెలిపారు. ఇక ఈ సినిమాని బాలకృష్ణ భార్య వసుంధర చూసి బాలకృష్ణ ఇందులో చాలా బాగున్నారు. బాలకృష్ణని బాగా చూపించారని మెచ్చుకున్నట్టుగా వినాయక్ తెలిపారు.

బాల‌కృష్ణ తండ్రీకొడుకులుగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా బాలకృష్ణ అభిమానులకి మాత్రం ఓ స్పెషల్ మూవీగా మిగిలిపోతుంది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు. శ్రియ, టబు హీరోయిన్లుగా నటించారు.

Krishna

Krishna

Next Story