Nani New Movie: వేణు శ్రీరామ్‌తో మరోసారి జతకట్టనున్న నాని?

Venu Sriram New Movie: వేణు శ్రీరామ్ ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమాతో బ్లాక్ బస్టర్ అంచుకున్నాడు.

Venkata Chari
Published on: 27 May 2021 5:41 PM IST
Director Venu Sriram to Direct Hero Nani Again in his New Movie
X

వేణు శ్రీరామ్, నాని (ఫొటో ట్విట్టర్)

Nani New Movie: వేణు శ్రీరామ్ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమాతో బ్లాక్ బస్టర్ అంచుకున్నాడు. తాజా నివేదికల ప్రకారం, ఈ డైరెక్టర్ తన తదుపరి సినిమాను నాచురల్ స్టార్ నానితో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వీరి కాంబోలో ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ కారణంగా వేణు శ్రీరామ్ 'ఐకాన్' సినిమా ఆలస్యం కానుంది. దీంతో ఈ ఖాళీ టైంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకే నానిని సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఐకాన్ నుంచి వేణు శ్రీరాం తప్పుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

అయితే, నాని, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లోని ప్రాజెక్ట్ కోసం కొంతకాలంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎంసీఏ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో.. మరోసారి ఈ దర్శకుడితో కలిసి పనిచేయడానికి నాని సిద్ధంగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story