Venu Sri Ram - Anirudh: తమన్ కన్నా అనిరుధ్ మిన్న అంటున్న వేణు శ్రీరామ్

admin1
Published on: 10 Aug 2021 12:40 PM IST
Director Venu Sri Ram to Replace Anirudh in the Place of Thaman in Allu Arjun ICON Movie
X

అనిరుద్  - థమన్ (ఫైల్ ఫోటో)

Anirudh - Venu Sri Ram : ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ త్వరలో అల్లు అర్జున్ హీరోగా నటించే "ఐకాన్" సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటులు మరియు సాంకేతిక బృందాన్ని వెతికే పనిలో పడ్డాడు వేణు శ్రీరామ్. "వకీల్ సాబ్" సినిమా కి ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం చాలా బాగా ప్లస్ అయింది అని చెప్పుకోవాలి కానీ వేణు శ్రీరామ్ మాత్రం "ఐకాన్" సినిమాకి ఎస్.ఎస్.తమన్ కాకుండా మరొక సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నాడట.

తాజా సమాచారం ప్రకారం పవన్ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తే బాగుంటుందని వేణు శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. కానీ ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు మాత్రం ప్రస్తుతం థమన్ మంచి ఫార్మ్ లో ఉన్నాడని, అతనిని సంగీతదర్శకుడిగా తీసుకోవడమే మంచిదని చెబుతున్నారట. మరి ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి "ఐకాన్" సినిమాకి ఎవరిని సంగీత దర్శకుడిగా ఎంచుకుంటారు అనేది ఇంకా తెలియాల్సింది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

admin1

admin1

Next Story