రాజమౌళిని ఢీకొట్టగల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్

*రాజమౌళిని ఢీకొట్టగల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్

Rama Rao
Updated on: 22 Sept 2022 3:00 PM IST
Director Trivikram who Can Break Rajamoulis Records | Telugu News
X

రాజమౌళిని ఢీకొట్టగల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్

SS Rajamouli: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత వినిపించే పేరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దే. తెలుగులో రాజమౌళి తర్వాత అదే స్థాయిలో భారీ పారితోషికం అందుకుంటున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాలి. ప్రతి సినిమాతోనూ బడ్జెట్ను పెంచుకుంటూ వెళ్తున్నారు త్రివిక్రమ్. ఇక ప్రస్తుతం సుకుమార్ పేరు కూడా ఈ మధ్య ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తోంది పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో సుకుమార్ సక్సెస్ అందుకున్నారు.

కానీ మార్కెట్ పరంగా చూసినా కూడా రాజమౌళిని ఢీకొట్టే సత్తా ఉన్నా డైరెక్టర్ త్రివిక్రమ్. భారీ ఎలివేషన్ లకు త్రివిక్రమ్ కూడా కేరాఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. అయితే తాజాగా రాజమౌళి కంటే త్రివిక్రమ్ ఒక విషయంలో పెద్ద తోపు అని తెలుసు కామెంట్లు వినిపిస్తున్నాయి. 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన "ఆర్ఆర్ఆర్" వరల్డ్ వైడ్ గా 12 వేల కోట్లను కలెక్షన్లను నమోదు చేసుకుంది. మరోవైపు త్రివిక్రమ్ మార్కెట్ చూస్తే అలవైకుంఠపురంలో సినిమాతో ఈజీగా 200 కోట్ల బిజినెస్ అందుకున్నారు.

ఇక మహేష్ బాబు సినిమాకి కూడా 300 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రాజమౌళి తర్వాత అదే రేంజ్ లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయడం లో త్రివిక్రమ్ దిట్ట అని చెప్పుకోవచ్చు. కథతో పాటు సినిమాలో ఎమోషన్లు మరియు డైలాగులు కూడా చాలా బలంగా ఉంటాయి కాబట్టి రాజమౌళి రికార్డులను బ్రేక్ చేయడానికి మిగతా డైరెక్టర్లతో పోలిస్తే త్రివిక్రమ్ కి కొంచెం ఈజీ అని చెప్పుకోవచ్చు.

Rama Rao

Rama Rao

Next Story