Trivikram: అక్కని చూడటానికి వెళ్లి చెల్లిని పెళ్లి చేసుకున్న మాటల మాంత్రికుడు

Sandeep Reddy
Updated on: 27 Nov 2021 4:54 PM IST
Director Trivikram Srinivas Twist in Bridal Glances
X

Trivikram Srinivas: అక్కని చూడటానికి వెళ్లి చెల్లిని పెళ్లి చేసుకున్న మాటల మాంత్రికుడు

Trivikram Srinivas: "స్వయంవరం" సినిమాతో డైలాగ్ రైటర్ గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి "నువ్వే నువ్వే" సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. "అతడు" సినిమాతో "జల్సా" చేస్తూనే తన "ఖలేజా"ని తెలుగు సినిమా పరిశ్రమకి చూపిస్తూ జులాయి, అత్తారింటికి దారేదిలో తన మాటలతో తెలుగు ప్రేక్షకులకు కేర్ అఫ్ డైలాగ్స్ మారి సన్నాఫ్ సత్యమూర్తి వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి "అ..ఆ" వంటి సినిమాలతోనూ ప్రేక్షకులతో ఆహా అనిపించుకొని "అజ్ఞాతవాసి"తో కొద్దిరోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిన మరోసారి "అరవింద సమేతా" అంటూ విజయంతో "అలా వైకుంటపురంలో"కి ఎంట్రీ ఇచ్చాడు మన మాటల మాంత్రికుడు.


ప్రస్తుతం "భీమ్లా నాయక్" చిత్రానికి తన మాట సహాయం చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తను దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాల్లో(అతడు, జల్సా) అక్కకి పెళ్లి సంబంధాలు వచ్చిన సమయంలో చెల్లిని పెళ్లిచూపులకు దూరంగా.., చెల్లిని అబ్బాయికి ఎందుకు కనబడకుండా దాస్తాడో ఈ స్టొరీ వింటే మీకు అర్ధమవుతుంది. 2001లో త్రివిక్రమ్ శ్రీనివాస్.. పెళ్లి చూపులకు వెళ్ళిన సమయంలో అక్కని చూడటానికి వెళ్లి ఆ పక్కనే ఉన్న ఆమె చెల్లి నచ్చడంతో త్రివిక్రమ్ ఆ విషయం కాస్త వారి ఇంటి సభ్యులకు చెప్పడంతో ఒక్కసారి వారు షాక్ అయ్యారట.


సరే అబ్బాయి మంచివాడు కాబట్టి చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి అమ్మాయి ఇంటి సభ్యులు కూడా ఓకే చెప్పారట. కాని పెద్ద అమ్మాయి పెళ్లి చేసిన తరువాతే వీరిద్దరి పెళ్లి చేస్తామని చెప్పడంతో ఒక ఏడాది తరువాత చిన్న అమ్మాయి సౌజన్యని త్రివిక్రమ్ కి ఇచ్చి 2002లో పెళ్లి చేశారు. ఇక త్రివిక్రమ్ భార్య సౌజన్య స్వయానా సిరి వెన్నెల సీతారామశాస్త్రికి మేనకోడలు. సౌజన్య శ్రీనివాస్ కు క్లాసికల్ డాన్సర్ గా మంచి పేరుంది. త్రివిక్రమ్ - సౌజన్య దంపతులకు ఇద్దరు పిల్లలు.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story