Akira Nandan: అకీరా ను త్రివిక్రమ్ చేతుల్లో పెట్టనున్న పవన్ కళ్యాణ్

Akira Nandan: మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

admin1
Updated on: 4 Aug 2021 3:49 PM IST
Director Trivikram And Pawan Kalyan Planning A Movie With Akira Nandan
X

Akira Nandan: అకీరా ను త్రివిక్రమ్ చేతుల్లో పెట్టనున్న పవన్ కళ్యాణ్ 

Akira Nandan: మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అకీరానందన్ ఎప్పుడెప్పుడు హీరో అవుతాడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రేణుదేశాయ్ అకీరా కర్ర సాము చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది. ఈనేపథ్యంలో అఖిరా నందన్ ఎంట్రీ మీద పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. పవన్ కళ్యాణ్ అకీరా నందన్ ను తెలుగులో హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా మాత్రమే కాక వ్యక్తిగతంగా కూడా త్రివిక్రమ్ చాలా మంచి స్నేహితుడని తెలిసిన విషయమే. అందుకనే అకీరానందన్ హీరోని చేసే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ చేతుల్లోనే పెట్టబోతున్నారని సమాచారం. ప్రస్తుతం అకిరా నందన్ పవన్ కళ్యాణ్ తోనే జూబ్లీహిల్స్ లో ఉంటున్నాడు. అక్కడే ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే అకీరా ను హీరోని చేసే ముందు ఇవన్నీ నేర్పించాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారని తెలుస్తోంది.

admin1

admin1

Next Story