Allu Arjun: బన్నీ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తోనా?

Director Trinadha Rao Nakkina Movie with Allu Arjun
x

Allu Arjun: బన్నీ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తోనా?

Highlights

Allu Arjun: బన్నీ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తోనా?

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప: ది రైజ్" సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మీక మందన్న ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తప్ప బన్నీ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. బన్నీ తదుపరి సినిమా గురించి ఈమధ్య కాలంలో బోలెడు పుకార్లు వచ్చినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

తాజాగా ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమా గురించి మరో పుకారు ఇండస్ట్రీ లో వినిపిస్తోంది. రవితేజ "ధమాకా" దర్శకుడు నక్కిన త్రినాధ రావు అల్లు అర్జున్‌కి ఒక మంచి కథను వినిపించారని సమాచారం. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దీని గురించి క్లారిటీ ఇచ్చారు. "అల్లు అర్జున్ గారు నన్ను పిలిచి మాట్లాడిన మాట నిజమే. నేను ఆయనకి రెండు కథలకి సంబంధించిన లైన్స్ వినిపించాను. కానీ వాటి బౌండ్ స్క్రిప్ట్ మాత్రం ఇప్పుడు సిద్ధంగా లేదు. కాబట్టి నేను నా సినిమా బన్నీ తో చేస్తానో లేదో ఇంకా తెలియదు," అని అన్నారు నక్కిన త్రినాధరావు.

ప్రస్తుతానికి బన్నీ దృష్టి "పుష్ప 2" పైనే ఉందని అన్నారు. అయితే "పుష్ప 2" తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తారు అని చెప్పలేం. ఒక మల్టీ-స్టారర్ బాలీవుడ్ సినిమా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. లేదా త్రివిక్రమ్ తో కూడా బన్నీ సినిమా చేసే సూచనలు ఉన్నాయి. ఏదేమైనా ఇంకా బన్నీ మాత్రం తన నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories