Sukumar: ఆ సినిమాలను రీమేక్ చేయాలని ఉంది అంటున్న సుకుమార్

Sukumar: ఈ తమిళ సినిమాలను రీమేక్ చేయాలనుకున్న సుకుమార్

admin1
Updated on: 11 Jan 2022 5:16 PM IST
Director Sukumar Wants to Remake Tamil Movies | Telugu Movie News
X

ఆ సినిమాలను రీమేక్ చేయాలని ఉంది అంటున్న సుకుమార్

Sukumar: "రంగస్థలం" సినిమా తో టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటిదాకా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ ఒరిజినల్ కానీ రీమేక్ సినిమాలు ఎప్పుడూ చేయలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుకుమార్ తనకి రెండు తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలని ఉన్నట్లు తెలిపారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమిళంలో సూపర్ హిట్ అయిన "విక్రమ్ వేదా" మరియు "రాట్సాసన్" సినిమాలని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదట. అయితే రాట్సాసన్ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు అనే టైటిల్తో తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులతో సతమతమైన బెల్లంకొండ కి ఈ సినిమాతోనే హిట్ లభించింది. ఇక మరోవైపు సుకుమార్ "పుష్ప 2" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ సినిమాని త్వరగా పూర్తిచేసి దసరా లేదా డిసెంబర్ కి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story