విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లతో సినిమాలు లైన్ లో పెట్టిన సుకుమార్

Director Sukumar Next Films with Ram Charan and Vijay Devarakonda
x

విజయ్ దేవరకొండ రామ్ చరణ్ లతో సినిమాలు లైన్ లో పెట్టిన సుకుమార్ 

Highlights

*పుష్ప తర్వాత తన సినిమా వీరితోనే అంటున్న సుకుమార్

Sukumar: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మధ్యనే "పుష్ప" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. మొదటిరోజు ఆవరేజ్ టాక్ వచ్చినప్పటినుంచి కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా. ఇక అతి త్వరలోనే సుకుమార్ ఈ రెండవ పార్ట్ అయిన "పుష్ప: ది రూల్" సినిమాతో బిజీ కాబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది దసరా లేదా డిసెంబర్ సమయానికి విడుదల అవుతుంది.

ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ దేవరకొండ తో ఒక సినిమా చేయబోతున్నారట. ఎమోషనల్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే యుద్ధం బ్యాక్ డ్రాప్ తో సాగుతుందట. విజయ్ దేవరకొండ ని ఇలాంటి సినిమాలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ హీరోగా మరొక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో విడుదలైన "రంగస్థలం" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories