బన్నీ సుకుమార్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బన్నీ సుకుమార్ సినిమాకు ముహూర్తం ఫిక్స్
x
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత కొంత కాలం అభిమానులను కన్ఫ్యూషన్ లో పెట్టిన బన్నీ ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా...

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత కొంత కాలం అభిమానులను కన్ఫ్యూషన్ లో పెట్టిన బన్నీ ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత బన్ని సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. నిజానికి మహేష్ 26వ సినిమాకి దర్శకత్వం వహించాల్సిన సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ 20 వ సినిమాకి దర్శకుడిగా మారాడు అన్నమాట.

అయితే అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ తరువాత దాని గురించి ఎవరూ నోరు మెదపకపోయేసరికి అభిమానులు కొంత కంగారు పడ్డారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం బన్ని సుకుమార్ సినిమా మే 11న అధికారికంగా చేయబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర విషయాల గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. ఈ చిత్ర షూటింగ్ మాత్రం త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories