Sukumar - Arya 3: ఆర్య 3 కూడా ఉండబోతోంది అంటున్న సుకుమార్

Sukumar - Arya 3: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప పార్ట్ 1"

admin1
Updated on: 10 Oct 2021 3:30 PM IST
Director Sukumar Gave Clarity on Pushpa Movie Release Date and Arya 3 Movie | Allu Arjun News Today
X

Sukumar - Arya 3: ఆర్య 3 కూడా ఉండబోతోంది అంటున్న సుకుమార్

Sukumar - Arya 3: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప పార్ట్ 1". "ఆర్య" మరియు "ఆర్య 2" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

మలయాళం సూపర్ సార్ ఫాహాధ్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

కానీ తాజాగా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు సుకుమార్. ఈ సినిమా అనుకున్న విధంగానే డిసెంబర్ 17న విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఫాహాధ్ పాత్ర "పుష్ప" పార్ట్ 1 లో మాత్రమే ఎంటర్ అవుతుందట.

ఇక పుష్ప పార్ట్ వన్ లో మెయిన్ విలన్ కమెడియన్ సునీల్ అని కూడా చెప్పుకొచ్చారు సుకుమార్. అంతేకాకుండా ఈ సినిమా పుష్ప పార్టు 2 తర్వాత "ఆర్య 3" కూడా మొదలు కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు సుకుమార్.

admin1

admin1

Next Story