Pushpa Movie - Samantha: ఐటెం సాంగ్ కోసం సమంత ఒప్పుకోలేదట

Pushpa Movie: "ఊ అంటావా ఊ ఊ అంటావా" పాట కోసం సమంతా ని ఒప్పించిన సుకుమార్

admin1
Updated on: 20 Dec 2021 6:24 PM IST
Sukumar Convinces Samantha for an Item Song in Pushpa Movie | Pushpa Samantha Item Song
X

"ఊ అంటావా ఊ ఊ అంటావా" పాట కోసం సమంతా ని ఒప్పించిన సుకుమార్ (ఫైల్ ఫోటో)

Pushpa Movie - Samantha Item Song: ఒకవైపు స్టార్ హీరోయిన్ గా తన పాత్రకి ప్రాధాన్యత ఉండే సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న సమంత ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "పుష్ప" సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న ఈ సినిమాలో తన ఐటెం సాంగ్ మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఆఫర్ వచ్చినప్పుడు ముందుగా సమంత ఏమాత్రం ఒప్పుకోలేదట. ఐటెం సాంగుల తో చేసే ఉద్దేశం ససేమిరా లేదని కొట్టిపారేసిందట.

"ముందుగా నేను ఈ ఆఫర్ తో తనని సంప్రదించినప్పుడు తను వెంటనే రిజెక్ట్ చేసింది. ఈ పాట తన కెరీర్లో మంచి డెసిషన్ అవ్వదేమో అని చెప్పింది. కానీ ఈ పాటలో తను చాలా బాగుంటుందని నేనే తనని కన్విన్స్ చేశాను. రంగస్థలం సినిమా లో కూడా పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ లో చేసిందని, అలానే చాలామంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్ లో ఉన్నారని గుర్తు చేశాను.

కానీ అప్పటికి ఒప్పుకోలేదు. కానీ చివరికి నా మీద నమ్మకంతో ఫైనల్ గా ఈ పాట చేయడానికి ఎస్ చెప్పింది. ఇప్పుడు ఈ పాటకి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చాలా సంతోషంగా ఉన్నాను" అని అన్నారు సుకుమార్.

admin1

admin1

Next Story