Sukumar: "పుష్ప 2" స్క్రిప్ట్ పూర్తి చేసిన సుకుమార్

Sukumar: "పుష్ప 2" స్క్రిప్ట్ పూర్తి చేసిన సుకుమార్

admin1
Updated on: 15 March 2022 9:16 AM IST
Director Sukumar Completes Pushpa-2  Movie Script | Tollywood News
X

Sukumar: "పుష్ప 2" స్క్రిప్ట్ పూర్తి చేసిన సుకుమార్

Sukumar: అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. తెలుగులో కూడా అద్భుతమైన కలెక్షన్లతో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా రాబోతున్న "పుష్ప: ది రూల్" గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సుకుమార్ ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసారట. అతి తొందరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతోంది తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న దర్శక నిర్మాతలు ఈసారి నార్త్ మార్కెట్ లో కూడా సినిమాని భారీగా ప్రమోట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story