Tollywood: ఓ స్టార్‌ డైరెక్టర్..‌ ప్లాప్‌ సినిమా రీమేక్

Tollywood: ఓ ప్లాప్‌ సినిమా రీమేక్‌.. * ఓ స్టార్‌ డైరెక్టర్‌ ప్లాప్‌ సినిమాను రీమేక్ చేస్తానని అనౌన్స్‌

Sandeep Eggoju
Published on: 16 March 2021 7:33 AM IST
Director Sukumar Announced to Remake the Jagadam Movie
X

ఫైల్ ఫోటో 

Tollywood: సినీ ఇండస్ట్రీలో ఏదైన ఓ సినిమా సూపర్‌ హిట్‌ అయితే ఇతర భాషలో రీమేక్‌ అవ్వడం సర్వసాధారణం. ఓ ప్లాప్‌ సినిమాను కూడా రీమేక్‌ చేస్తే ఎలా ఉంటుంది.? వినడానికి కాస్త విడ్డూరంగా ఉంది కదూ ఇది నిజం. ఓ స్టార్‌ డైరెక్టర్‌ ప్లాప్‌ సినిమాను రీమేక్ చేస్తానని అనౌన్స్‌ చేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్‌ ఎవరు? ఆ సినిమా ఏమిటో చూడండి.

సినీ ఇండస్ట్రీలో రీమేక్‌లు కొత్తేమీ కాదు. ఒక భాషలో హిట్టైన మూవీని దర్శక, నిర్మాతలు మరో భాషలో రీమేక్ చేస్తుంటారు. కానీ తెలుగులో ప్లాప్‌ అయిన మూవీకి రీమేక్‌ రాబోతోంది. ఇదేంటి హిట్టైన సినిమాకు సీక్వెలో, రీమేకో రావడం కామన్. కానీ ప్లాప్ మూవీకి కూడా రీమేక్‌ వస్తుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్, రామ్‌తో తీసిన జగడం సినిమాకు మార్చి 16కి 14 ఏళ్లు పూర్తవుతుంది. అప్పట్లో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.

హీరో రామ్‌కు ఆ సినిమా చేసేటప్పుడు 17 ఏళ్లు. అప్పుడు ఎటువంటి ఇమేజ్‌ లేని టైమ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించే బేష్‌ అనిపించుకున్నాడు. జగడం వచ్చి 14 ఏళ్లు అవుతున్న సందర్భంగా సుకుమార్ ఇప్పుడు రామ్‌కు ఉన్న ఇమేజ్‌ను, ఎనర్జీకి తగ్గట్టు జగడం మూవీకి కొన్ని మార్పులు చేసి. సినిమా చెయ్యాలనుందని ప్రకటించాడు. దీంతో ఈ వార్త టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. మరి జగడం మూవీ ప్రకటనకే పరిమితం అవుతుందా? రీమేక్‌గా వస్తుందో వేచి చూడాలి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story