Sukumar-Vijay Deverakonda: 2023లో సుకుమార్ రాంపేజ్ అంటున్న విజయ్ దేవరకొండ

Sukumar-Vijay Deverakonda: సుకుమార్ రాంపేజ్ క్రియేట్ చేస్తాడు అంటున్నా విజయ్ దేవరకొండ

admin1
Updated on: 12 Jan 2022 9:01 PM IST
Director Sukumar and Vijay Deverakonda Combination Rampage Movie in 2023
X

 2023లో సుకుమార్ రాంపేజ్ అంటున్న విజయ్ దేవరకొండ

Sukumar-Vijay Deverakonda: ఈ మధ్యనే "పుష్ప: ది రైస్" అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు తన దృష్టి మొత్తం ఈ సినిమాకి రెండవ భాగం గా విడుదల కాబోతున్న "పుష్ప" పైనే పెట్టారు. అల్లు అర్జున్, రష్మీక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కాబోతోంది. ఈ సంవత్సరం దసరా లేదా డిసెంబర్ కి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. అయితే తాజాగా ఇవాళ సుకుమార్ తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా సుకుమార్ కి ఆసక్తికరంగా విష్ చేశారు. "2021 లో ది రైజ్, 2022 లో ది రూల్, 2023 లో ది ర్యాంపేజ్" అంటూ చెప్పుకొచ్చారు విజయ్. అంతేకాకుండా "మీతో సినిమా మొదలు పెట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని అన్నారు విజయ్. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమా తో బిజీగా ఉన్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.


admin1

admin1

Next Story