Director Sujeeth Gets Married : ఓ ఇంటివాడు అయిన సాహో డైరెక్టర్..!

Director Sujeeth Gets Married : కరోనా, లాక్ డౌన్ అయినప్పటికీ టాలీవుడ్ లో పెళ్లిల హవా నడుస్తుంది. ఇప్పటికే నిఖిల్, దిల్ రాజులు

Krishna
Published on: 3 Aug 2020 3:34 PM IST
Director Sujeeth Gets Married :  ఓ ఇంటివాడు అయిన సాహో డైరెక్టర్..!
X
Director Sujeeth Reddy Gets Married To Pravallika

Director Sujeeth Gets Married : కరోనా, లాక్ డౌన్ అయినప్పటికీ టాలీవుడ్ లో పెళ్లిల హవా నడుస్తుంది. ఇప్పటికే నిఖిల్, దిల్ రాజులు పెళ్లి పెళ్లిపీట‌లెక్కిగా, తాజాగా యంగ్ హీరో నితిన్ కూడా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ పెద్దగా హడావిడి లేకుండా పెళ్లిపీట‌లెక్కాడు.. సుజిత్ కి గ‌త నెల‌లో హైద‌రాబాదీ అమ్మాయి ప్రవ‌ల్లిక‌తో నిశ్చితార్థం జ‌రిగిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.

వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇండస్ట్రీ నుంచి అభిమానుల వరకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు.కరోనా నేపధ్యంలో జరిగిన పెళ్లి కావడంతో అత్యంత సన్నిహితుల మధ్యనే ఈ వివాహం జరిగింది. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఈ వివాహ వేడుకకి హాజరు కాలేదని తెలుస్తోంది. ఇక వీరి పెళ్లి ఫోటోలను ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ సోష‌ల్ మీడియాలో పెట్టడంతో సుజిత్ పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలిసింది.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి డైరెక్టర్ గా ఎదిగాడు సుజీత్ .. ముందుగా శర్వానంద్ హీరోగా వచ్చిన ర‌న్ రాజా ర‌న్ చిత్రంతో ద‌ర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సుజీత్.. ఆ త‌రువాత ప్రభాస్ తో చేసిన `సాహో`సినిమా బిగ్గెస్ట్ హిట్ కాకపోయినప్పటికీ సుజీత్ కి మంచి పేరును తీసుకువచ్చింది. ప్రస్తుతం సుజీత్ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మలయాళ సినిమాని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సుజీత్ దర్శకుడు అం ప్రచారం సాగుతుంది.

Krishna

Krishna

Next Story