మంచి స్క్రిప్ట్ ఉంటే రజనీకాంత్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న రాజమౌళి

* "ఆర్ఆర్ఆర్" సినిమాకి అదే ఇన్స్పిరేషన్ అంటున్న జక్కన్న

admin1
Updated on: 13 Dec 2021 7:01 PM IST
Director SS Rajamouli says I will do Movie with Rajinikanth when i have Good Script for him
X

మంచి స్క్రిప్ట్ ఉంటే రజనీకాంత్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న రాజమౌళి

SS Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ మొదలు పెట్టింది ఈ చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా గురించి చెన్నైలో జరిగిన చిత్ర ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హాలీవుడ్ లోని 2019 లో విడుదలైన ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనే సినిమా చాలావరకు తన సినిమాలకి ఇన్స్పిరేషన్ అని ముఖ్యంగా "ఆర్ఆర్ఆర్" సినిమాకి ఈ చిత్రం ఇన్స్పిరేషన్ అని చెప్పారు రాజమౌళి.

"ఆ సినిమాలో హిట్లర్ చనిపోయినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఆ సినిమాలో అది చాలా పెద్ద సర్ప్రైస్. అలానే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా పాత్రలకీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అని అనిపిస్తుంది" అని అన్నారు రాజమౌళి.ఇక తన తదుపరి సినిమా మహేష్ బాబు తో ఉంటుందని చెప్పిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యేదాకా దాని గురించి ఆలోచన చెయ్యడం లేదని చెప్పారు. సరిగ్గా సరిపోయే స్క్రిప్ట్ గనక ఉంటే రజనీకాంత్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు అని తెలిపారు.

admin1

admin1

Next Story