ఇక బ్రేకులు వద్దు అంటున్న రాజమౌళి

Ruthvik
Published on: 19 May 2019 3:04 PM IST
ఇక బ్రేకులు వద్దు అంటున్న రాజమౌళి
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ బాగానే జరిగింది కానీ తర్వాత రామ్ చరణ్ కి చిన్నపాటి గాయాలు అవ్వడం తో షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం ఇద్దరు కోలుకోవడంతో త్వరలో షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి ప్లాన్. ఇప్పటికే ఈ చిత్రం కోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే రాజమౌళి ఇప్పటినుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని చేస్తున్నారట. పేరుకి సంవత్సరం ఆఖరి వరకు టైం ఉంది కానీ అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఇకపై బ్రేక్స్ లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని రాజమౌళి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం కూడా వెతుకులాట మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై లో విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story