Unstoppable Talk Show: ఇది ప్రోమో అని అందరికీ తెలుసంటూ బాలయ్యకి రాజమౌళి కౌంటర్

Sandeep Reddy
Published on: 15 Dec 2021 5:25 PM IST
Director Rajamouli Attends as a Guest to Balakrishna Unstoppable Talk Show Promo Released Today 15 12 2021
X

Unstoppable Talk Show: ఇది ప్రోమో అని అందరికీ తెలుసంటూ బాలయ్యకి రాజమౌళి కౌంటర్ (ఫోటో: ఆహా) 

Unstoppable Talk Show: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్ స్టాపబుల్" టాక్ షోకి చీఫ్ గెస్ట్ లుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి, కీరవాణి హాజరయ్యారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని ఆహా విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో బాలకృష్ణ అడిగిన ఏ ప్రశ్నకి రాజమౌళి సమాధానం చెప్పకుండా చిన్న పంచ్ డైలాగ్ తో ప్రోమోని ముగించేశాడు. "మీరు ఇంటెలిజెంట్, అచివర్ అని అందరికీ తెలుసు. మరి ఎందుకు ఇంకా ఆ తెల్లగడ్డం?" అని బాలకృష్ణ ప్రశ్నించగా రాజమౌళి గడ్డం మీద చేతులు వేసికొని సరిచేసుకున్నారు.

ఆ తర్వాత "ఇప్పటివరకు మన ఇద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా రాలేదు.. నా ఫ్యాన్స్ మిమ్మల్ని బాలయ్యతో సినిమా ఎప్పుడు? అని అడిగారు. దానికి మీ సమాధానం ఏంటి?" అని బాలకృష్ణ అడిగిన మరొక ప్రశ్నకి రాజమౌళి మీసం తిప్పారు.

ఆ తరువాత "మీతో సినిమా చేసిన హీరోకి సూపర్ హిట్ ఇస్తారు కాని ఆ హీరోల తరువాత రెండు సినిమాలు ఫసక్ ఏ కదా? అని బాలయ్య బాబు అడిగిన ప్రశ్నకి రాజమౌళి మాట్లాడుతూ "నాకు తెలుసు, మీకు తెలుసు, షూట్ చేసే వాళ్లకూ తెలుసు ఇది ప్రోమో అని.. అన్నింటికీ ఎపిసోడ్ లోనే సమాధానాలు చెబుతా" అంటూ బాలయ్యకి కౌంటర్ ఇచ్చాడు. తాజాగా విడుదలైన ప్రోమో చూసిన అభిమానులు డిసెంబర్ 17న విడుదలయ్యే ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story