మరో టాలీవుడ్‌ జంట విడాకులు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ భార్య.. ?

Director Srinu Vaitlas Wife Files for Divorce
x

మరో టాలీవుడ్‌ జంట విడాకులు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ భార్య.. ?

Highlights

Srinu Vaitla Divorce: ఈ మధ్యకాలంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి.

Srinu Vaitla Divorce: ఈ మధ్యకాలంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య, అమీర్ ఖాన్-కిరణ్ ఇప్పటికే విడాకులు తీసుకొని ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇప్పుడు మరొక స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నారు. వారే డైరెక్టర్ శ్రీను వైట్ల మరియు అతని భార్య రూప.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్నారు. తాజాగా ఇప్పుడు తన సూపర్ హిట్ సినిమా ఢీకి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేసి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు. ఇక షూటింగ్ సెట్స్ మీదకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటూ ఉండగా సినిమాకి బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా ఇప్పుడు శ్రీను వైట్ల తన భార్య రూపతో విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే పలు సినిమాలలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన రూపను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీనువైట్ల. గతంలో కూడా వీరు విడాకులు తీసుకుందాం అనుకున్నప్పుడు రూప తల్లిదండ్రులు జోక్యం చేసుకొని వారు నిర్ణయాలు వెనక్కి తీసుకునేలా చేశారు. ఈ మేరకు ఆయన భార్య రూపా నాంపల్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం. కాగా 2003 ఆగస్టులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు.

Show Full Article
Print Article
Next Story
More Stories