Srinu Vaitla: "ఆగడు" సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీను వైట్ల

* మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడు గోల చేశారు అంటున్న శ్రీనువైట్ల

admin1
Updated on: 3 Nov 2021 12:30 PM IST
Director Srinu Vaitla Shcoing Comments on Aagadu Movie
X

శ్రీను వైట్ల (ఫైల్ ఫోటో)

Srinu Vaitla: 2014లో విడుదలైన "ఆగడు" సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే మర్చిపోలేని డిజాస్టర్ గా మారింది. శ్రీను వైట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దూకుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండవ సినిమా ఇది. "పోకిరి" సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత మళ్లీ ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో కనిపించిన శ్రీను వైట్ల ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

"ఆగడు" సినిమా మొదలు పెట్టే ముందు మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి తనకి ఒక మాస్ సినిమా కావాలి మాస్ సినిమా చేయండి అని చాలా ప్రెజర్ వచ్చిందని అన్నారు. "కానీ నేను సెల్ఫిష్ గా ఉండాలని నేర్చుకున్నాను. ముందు ఎవరికైనా తనని తాను కాపాడుకోవడం తెలియాలి" అని అన్నారు శ్రీనువైట్ల. ఈ మధ్యనే విడుదలైన ప్రోమోలో శ్రీను వైట్ల అన్న మాటలవి. అయితే పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్ప శ్రీనువైట్ల చెప్పిన దాని గురించి క్లారిటీ రాకపోవచ్చు. ఈ ఎపిసోడ్ నవంబర్ 8న ప్రసారం కాబోతోంది. కారణాలేవైనా "ఆగడు" సినిమా మాత్రం మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా మారింది.

admin1

admin1

Next Story