Srinu Vaitla: మళ్లీ మహేష్ బాబు తో పనిచేయాలని ఉంది

* ఆ సినిమా "దూకుడు" సినిమాకి సీక్వెల్ కాదని ముందే క్లారిటీ ఇచ్చేశారు * "అది దూకుడు సీక్వెల్ కాదు," అంటున్న శ్రీనువైట్ల

admin1
Updated on: 24 Sept 2021 4:01 PM IST
Director Srinu Vaitla Said in an interview that He Want do Movie with Mahesh Babu
X

శ్రీను వైట్ల - మహేష్ బాబు(ఫోటో- ది హన్స్ ఇండియా) 

Mahesh Babu New Movie - Srinu Vaitla: టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులలో శ్రీనువైట్ల కూడా ఒకరు. కానీ శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దూకుడు సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే "దూకుడు" సినిమా తర్వాత శ్రీను వైట్ల కెరీర్ లో అన్ని డిజాస్టర్లే. వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న శ్రీనువైట్ల 2018లో రవితేజ హీరోగా అమర్-అక్బర్-ఆంటోని సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించారు.

కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో శ్రీను వైట్ల గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీను వైట్ల మహేష్ బాబు తో మళ్ళి పని చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ స్వయంగా శ్రీనువైట్ల చెప్పారు.

"నాకు మళ్లీ మహేష్ బాబు తో పనిచేయాలని ఉంది. నా దగ్గర తనకు సరిపోయే ఒక కథ కూడా రెడీగా ఉంది. నా దగ్గర మూడు పూర్తి స్క్రిప్ట్ లు రెడీగా ఉన్నాయి. ఈసారి మాత్రం నేను మహేష్ బాబుతో ఒక పెద్ద ప్రాజెక్టు చేయాలని ప్లాన్ చేస్తున్నాను ఆ రేంజ్ కి తగ్గ కథ రెడీ అయితే వెంటనే వెళ్లి మహేష్ బాబు కి నెరేట్ చేస్తాను," అని అన్నారు శ్రీనువైట్ల.

అయితే ఆ సినిమా "దూకుడు" సినిమాకి సీక్వెల్ కాదని ముందే క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు శ్రీనువైట్ల తన "ఢీ" సినిమాకి సీక్వెల్ "డీ అండ్ డీ" తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

admin1

admin1

Next Story