Srikanth Addala: ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో శ్రీకాంత్ అడ్డాలా.? ఇంతకా బ్యూటీ ఎవరంటే

Srikanth Addala
x

Srikanth Addala: ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో శ్రీకాంత్ అడ్డాలా.? ఇంతకా బ్యూటీ ఎవరంటే

Highlights

Srikanth Addala: కొత్త బంగారం లోకం సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు శ్రీకాంత్ అడ్డాల. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Srikanth Addala: కొత్త బంగారం లోకం సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు శ్రీకాంత్ అడ్డాల. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా అప్పట్లో యూత్‌కు తెగ నచ్చింది. కాగా రెండో చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ముకుంద, బ్రహ్మోత్సవం వంటి అపజయాలను మూటగట్టుకున్న శ్రీకాంత్‌ అడ్డాల ఆ తర్వాత నారప్ప సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదిలా ఉంటే వివాదాలకు దూరంగా ఉండే శ్రీకాంత్‌ అడ్డాలకు సంబంధించిన ఓ వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గత కొంతకాలంగా శ్రీకాంత్ అడ్డాల కోలీవుడ్ నటి బ్రిగిడా సాగాతో రిలేషన్‌లో ఉన్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చెన్నైలో ఇద్దరూ కలిసి ఉంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశంపై కోలీవుడ్ నటుడు, దర్శకుడు పార్థీబన్ స్పందించారు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బ్రిగిడాను పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తిగా నన్ను చాలామంది ఈ విషయంపై ప్రశ్నిస్తున్నారు. కానీ వారిద్దరి మధ్య నిజంగా ఏమైనా ఉందా అనే విషయం నాకు తెలియదు. బ్రిగిడా మంచి నటి. నటనలో ఉన్న ట్యాలెంట్‌తో ఆమె బాగా ముందుకు వెళ్లగలదు. ఇలాంటి పుకార్లను ఆమె పట్టించుకోదు. ఆమె లక్ష్యం సినిమాలే. రిలేషన్‌లతో తన కెరీర్‌ను ప్రభావితం చేసుకోదని నేను భావిస్తున్నాను' అని చెప్పుకొచ్చారు.

బ్రిగిడా తెలుగులో సింధూరం, పెద కాపు–1 చిత్రాల్లో నటించింది. పెద కాపుకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన వషయం తెలిసిందే. ఇదే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అటు శ్రీకాంత్‌ గానీ, బ్రిగిడా గానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేరు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories