Shankar Ram Charan Movie: చరణ్ కోసం రంగంలోకి ముగ్గురు స్టార్స్?

Director Shankar to Cast Three Super Stars in his New Movie With Ram Charan
x

సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి, ఉపేంద్ర (ఫొటో: ది హాన్స్ ఇండియా)

Highlights

Shankar Ram Charan Movie: శంకర్ దర్శకత్వంలో మెగా హీరో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Shankar Ram Charan Movie: శంకర్ దర్శకత్వంలో మెగా హీరో రాం చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. మేకర్స్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ కాంబినేషన్‌లోని సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇంతలో, ప్రాజెక్ట్ చుట్టూ కొన్ని ఆసక్తికరమైన పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజా సంచలనం ప్రకారం, ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం సల్మాన్ ఖాన్‌ను సంప్రదించాలని ఫిల్మ్ యూనిట్ యోచిస్తోందంట. అదే సమయంలో, ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర కోసం విజయ్ సేతుపతి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ నటుడు ఉపేంద్రను కూడా బోర్డులో పెట్టాలని ఫిల్మ్ యూనిట్ కోరుతోందంట.

ఇక టాలీవుడ్ నుంచి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆచార్యలో చరణ్-చిరులను ఒకే స్క్రీన్‌పై చూసే అవకాశం వచ్చింది. ఈ వార్తే నిజమైతే.. పవన్-చరణ్‌ల కాంబో కూడా వెండితెరపై కనువిందు చేసే అవకాశం ఉంది.

రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఆచార్య షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. అలాగే'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories