ఎన్టీఆర్ తో శంకర్.. ప్లాన్ మామూలుగా లేదుగా..

Director Shankar Next Film With Jr NTR
x

ఎన్టీఆర్ తో శంకర్.. ప్లాన్ మామూలుగా లేదుగా..

Highlights

Jr NTR: రాజమౌళి తర్వాత పాన్ ఇండియన్ సినిమాలు తీసే డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శంకర్.

Jr NTR: రాజమౌళి తర్వాత పాన్ ఇండియన్ సినిమాలు తీసే డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శంకర్. రోబో, 2.0 సినిమాలతో శంకర్ భారతదేశం మొత్తం మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి 2.0 సినిమా తర్వాత శంకర్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకి సీక్వెల్ అయిన భారతీయుడు సినిమా ని ప్రారంభించారు. కానీ ఆ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. దీంతో భయపడి సినిమా షూటింగ్ ని అర్ధాంతరంగా నే ఆపేశారు. ఆ తర్వాత ఆ సినిమాని మళ్ళీ ప్రారంభించేందుకు శంకర్ చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవేవి ఫలించకపోవడంతో రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టేసారు.

ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా వైజాగ్ లో జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఒక నిజాయితీ కలిగిన అధికారి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన తరువాత శంకర్ మరొక తెలుగు హీరో తో ఓ సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో రామ్ చరణ్ తో పాటు నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మధ్యనే ఎన్టీఆర్ కి కథ చెప్పడానికి శంకర్ సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమా పట్టాలెక్కి అవకాశాలు ఉన్నాయో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు కొరటాల శివ తో సినిమా మొదలు పెట్టిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories