Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో శంకర్ సినిమా..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో సంక్రాంతికి లేదంటే అంతకంటే ముందే బాక్సాఫీస్ మీద దండెత్తనున్నాడు.

Arun Chilukuri
Updated on: 8 Jun 2023 9:30 PM IST
Director Shankar Movie With Pawan Kalyan
X

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో శంకర్ సినిమా..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో సంక్రాంతికి లేదంటే అంతకంటే ముందే బాక్సాఫీస్ మీద దండెత్తనున్నాడు. ఓజీ మాత్రం దసరాకనంటున్నారు. ఇలా లెక్కలు మారాయి. సో హరి హర వీరమల్లు సమ్మర్ లో వస్తే ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ అయిపోయినట్టే.. ఆతర్వాత ఏంటనే ప్రశ్నకి శంకర్ ప్రాజెక్టే సమాధానంగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ నిజానికి పవన్ తో మూవీ తీయబోతేనే, దిల్ రాజు సీన్ లోకి వచ్చి, ఆ కథకి చరణ్ కరెక్ట్ అన్నాడట. అలా గేమ్ ఛేంజర్ లో చెర్రీ సీన్ లోకి వచ్చాడనే ప్రచారం జరిగింది.

ఐతే శంకర్ తన మేకింగ్ లో పవన్ తో సినిమా చేయాలన్న ఆలోచన మాత్రం ఇప్పటిదీ కాదని తెలుస్తోంది. త్రీ ఇడియట్స్ తమిళ రీమేక్ టైంలోనే పవన్ తో మూవీ ప్లాన్ చేశాడట శంకర్. అప్పట్లో పవన్ నోచెప్పటంతోనే అది తమిళ స్టార్ విజయ్ తో తీశాడనే ప్రచారం కూడా జరిగింది. త్రీ ఇడియర్స్ రీమేక్ తర్వాత గేమ్ ఛేంజర్ కథ కూడా పవన్ కోసమే సిద్దం చేసుకున్నాడట శంకర్. కాని అది పవన్ కి నప్పదని చరణ్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు దిల్ రాజు అనే ప్రచారం కూడా జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు శంకర్ మూడో ప్రయత్నం చేయబోతున్నాడని తెలుస్తోంది.

పవన్ తో శంకర్ సినిమా ఏపీలో ఎలక్షన్స్ తర్వాత ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగాయి. కాని ఎన్నికల తర్వాత సినిమాలతో కంటే ప్రజాసేవకే టైం కేటాయించాలనుకుంటున్న పవన్, శంకర్ మూవీ మూడో సారి కూడా పక్కన పెట్టేయొచ్చనే మాటలే వినిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story