Shankar: ఏకంగా 1000 కోట్ల సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్

Shankar is Planning a 1000 Crore Film
x

Shankar: ఏకంగా 1000 కోట్ల సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్ 

Highlights

Shankar: సూర్య కాంబోలో వస్తున్న సినిమా బడ్జెట్ కోసం దిమ్మతిరిగే బడ్జెట్

Shankar: సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా #ఆర్సీ15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా "భారతీయుడు" వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అయిన "భారతీయుడు 2" సినిమాతో కూడా బిజీగా ఉన్నారు శంకర్. ఈ రెండు సినిమాల షూటింగ్ సమాంతరంగా జరుపుకుంటున్నాయి. ఈ ఏడాది చివరిలోపు ఈ రెండు సినిమాల షూటింగ్ ను పూర్తి చేయాలని శంకర్ చాలా పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న శంకర్ తన తదుపరి సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేస్తున్న తర్వాత శంకర్ సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

అయితే ఇది మామూలు సినిమా కాదు భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది. చారుత్రాత్మక నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేల్పరి అనే నవర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను వెంకటేష్ అనే నిర్మాత దిమ్మతిరిగే బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చరిత్రలో ఒక తమిళ రాజు కి సంబంధించిన కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని సమాచారం. వచ్చే ఏడాది అయితే ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ రేంజిలో విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రెండు లేదా మూడు భాగాలుగా విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories