Venkatesh: విక్టరీ వెంకటేష్ తో జతకట్టనున్న శేఖర్ కమ్ముల?

Venkatesh: వెంకటేష్ త్వరలో శేఖర్ కమ్ములతో జతకట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Venkata Chari
Published on: 29 March 2021 3:46 PM IST
Director Sekhar Kammula to Direct Hero Venkatesh?
X

విక్టరీ వెంకటేష్, శేఖర్ కమ్ముల

Venkatesh: విక్టరీ వెంకటేష్ త్వరలో శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 'ఫిదా', 'హ్యాపీ డేస్' వంటి బ్లాక్ బస్టర్ లు అందించిన శేఖర్ కమ్ముల.. వెంకటేష్ తో పనిచేయడం సంచలనమే కావొచ్చని తెలుస్తోంది. ఈమేరకు శేఖర్ కమ్ముల ఓ చిత్రం కోసం వెంకీ మామాను సంప్రదించినట్లు వార్తలు వినిసిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని కె. నారాయణ్ దాస్ నిర్మించనున్నట్లు టాక్. నటీనటుల వివరాలు కూడా ఇంకా తెలియలేదు. ప్రస్తుతం వెంకటేష్ మూడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రివెంజ్ డ్రామాగా వస్తున్న 'నారప్ప' సినిమా చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ వేసవిలో థియేటర్లలోకి రానుంది.

అలాగే ఎఫ్ 2 కి సీక్వెల్ అయిన "ఎఫ్ 3" సినిమా కోసం అనిల్ రావిపూడితో కలిసి పనిచేస్తున్నాడు. మరో రీమేక్ అయిన ద్రుశ్యం 2 లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు అయిన తర్వాత శేఖర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శేఖర్ కమ్ముల "లవ్ స్టోరీ" ఏప్రిల్ 16 న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

Venkata Chari

Venkata Chari

Next Story