Love Story Movie: "లవ్ స్టోరీ" కి రెండు క్లైమాక్స్ లు సెట్ చేసిన శేఖర్ కమ్ముల

Director Sekhar Kammula Sets Two Climax Scenes for Love Story Movie
x

 నాగచైతన్య మరియు సాయి పల్లవి నటించిన సినిమా "లవ్ స్టోరీ'' (ఫోటో- ది హన్స్ ఇండియా )

Highlights

* ఈ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది * ఈ సినిమా కోసం రెండు విభిన్న క్లైమాక్స్ షూట్ చేశారట

Love Story - Sekhar Kammula: యువ హీరో నాగచైతన్య మరియు స్టార్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా "లవ్ స్టోరీ". శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది. ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వెండితెరపై నాగచైతన్య మరియు సాయి పల్లవి ల మధ్య కెమిస్ట్రీ చూసేందుకు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మొదటి హాఫ్ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా సాగినప్పటికీ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుందట. ఈ సినిమాలో సాయి పల్లవి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి మరియు నాగ చైతన్య డాన్సర్గా కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం రెండు విభిన్న క్లైమాక్స్ షూట్ చేశారట.

అందులో ఒకటి సాడ్ కాగా మరొకటి హ్యాపీ ఎండింగ్ అని తెలుస్తోంది మరి ఆఖరికి నాగచైతన్య మరియు సాయి పల్లవి ల ప్రేమ కథ కి హ్యాపీ ఎండింగ్ దొరుకుతుందా లేక మిగిలిపోతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories