Sampath Nandi: మళ్లీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అంటున్న సంపత్ నంది

* పవర్ స్టార్ తో కచ్చితంగా సినిమా ఉంటుందని చెబుతున్న సంపత్ నంది

admin1
Updated on: 15 Sept 2021 2:33 PM IST
Director Sampath Nandi Says I will Do Another Movie With Power Star Pawan Kalyan
X

సంపత్ నంది - పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Sampath Nandi: టాలీవుడ్ లో ఉన్న కమర్షియల్ దర్శకులలో సంపత్ నంది కూడా ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి కథలను ప్రేక్షకులకు అందించారు సంపత్ నంది. తాజాగా గోపీచంద్ హీరోగా విడుదలైన "సీటీమార్" సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వినాయక చవితి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో సంపత్ నంది తదుపరి సినిమాపై గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోసాని కృష్ణమురళి దగ్గర మూడేళ్లు సహాయ దర్శకుడిగా పనిచేసిన సంపత్ నంది 2010లో "ఏమైంది ఈ వేళ" అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో "రచ్చ", రవి తేజ తో "బెంగాల్ టైగర్" సినిమా ప్రేక్షకులకు అందించిన సంపత్ నంది ఇప్పుడు "సీటీమార్" తో అందరి దృష్టిని ఆకర్షించారు.

నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర కోసం రామ్ చరణ్ అయితే బాగుంటుందని చాలా మంది చెప్పారని, కానీ రామ్ చరణ్ ని ఒక కోచ్ పాత్రలు ఊహించుకోలేక మరో హీరోకి నరెట్ చేశానని, ఆ తర్వాత సినిమా గోపీచంద్ వద్దకు వెళ్లిందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని సంపత్ నంది అన్నారు. "గబ్బర్ సింగ్" సమయంలో తనకు పవన్ కళ్యాణ్ కి మధ్య హెల్దీ రిలేషన్షిప్ ఉందని వారి కాంబినేషన్ లో ఒక సినిమా త్వరలోనే చూడొచ్చని అన్నారు సంపత్ నంది.

admin1

admin1

Next Story