Sampath Nandi New Movie: రాజమౌళి సినిమా సీక్వెల్ కోసం సంపత్ నంది!?

* విక్రమార్కుడు సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడనుంది

admin1
Updated on: 22 Sept 2021 7:01 PM IST
Director Sampath Nandi New Movie to Shoot a Rajamouli Vikramarkudu Movie Sequel
X

సంపత్ నంది (ఫోటో- ది హన్స్ ఇండియా )

Sampath Nandi - Vikramarkudu Sequel: మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో "విక్రమార్కుడు" సినిమా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ కూడా అయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ ని అందించిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పుడు "విక్రమార్కుడు" సినిమా సీక్వల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సీక్వల్ కోసం కథను రెడీ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించట్లేదని తెలుస్తోంది.

"విక్రమార్కుడు" సీక్వెల్ కోసం కథ రెడీ అవ్వగానే విజయేంద్రప్రసాద్ ఆ కథని ఒక యువ దర్శకుడికి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం దర్శకుడు సంపత్ నంది ని సంప్రదించినట్లు సమాచారం.

ఈ మధ్యనే గోపీచంద్ హీరోగా నటించిన "సీటీమార్" సినిమాకి దర్శకత్వం వహించిన సంపత్ నంది ఇంతకు ముందు రవితేజతో "బెంగాల్ టైగర్" సినిమా కోసం కలిసి పనిచేశారు. అయితే విక్రమార్కుడు సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడనుంది. మరో వైపు రవితేజ "ఖిలాడి" మరియు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story