నెక్స్ట్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న "భీమ్లా నాయక్" డైరెక్టర్

నెక్స్ట్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న "భీమ్లా నాయక్" డైరెక్టర్

admin1
Updated on: 28 Feb 2022 10:01 PM IST
Director Sagar K Chandra is Hoping for his Next Film
X

నెక్స్ట్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న "భీమ్లా నాయక్" డైరెక్టర్

Saagar K Chandra: నారా రోహిత్ మరియు శ్రీ విష్ణు లు హీరోలుగా నటించిన "అప్పట్లో ఒకడుండేవాడు" సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కే చంద్ర ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా "భీమ్లా నాయక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారడంతో సాగర్ కే చంద్ర తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా కోసం సాగర్ ఎంత కష్టపడ్డప్పటికే, త్రివిక్రమ్ శ్రీనివాస్ కే ఎక్కువ క్రెడిట్ దక్కింది.

అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారని కేవలం సాగర్ కే చంద్ర ను మానేజర్ గా పెట్టుకున్నట్లుగా కొందరు కామెంట్లు కూడా చేశారు. కానీ సాగర్ కి చంద్ర కి త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ కేవలం తోడ్పడ్డారు అని విశ్వసనీయ వర్గాలు చెప్పుకోచ్చాయి. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిన ప్పటికీ సాగర్ కే చంద్ర భవిష్యత్తు తన తదుపరి సినిమా మీద మాత్రమే ఆధార పడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ సాగర్ కే చంద్ర తన తదుపరి సినిమాతో హిట్ అందుకోగలిగితే ఇండస్ట్రీలో కచ్చితంగా నిలదొక్కుకుంటాడు అని అభిమానులు చెబుతున్నారు.

admin1

admin1

Next Story