logo

మోడీ పై సెటైర్లు వేస్తున్న అర్జీవి

మోడీ పై సెటైర్లు వేస్తున్న అర్జీవి
Highlights

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు పుట్టినిల్లు అని కొందరు అంటుంటారు. వారి మాటలను నిజం చేస్తూ ఆర్జీవి ఎప్పుడూ...

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు పుట్టినిల్లు అని కొందరు అంటుంటారు. వారి మాటలను నిజం చేస్తూ ఆర్జీవి ఎప్పుడూ ఏదో ఒక వివాదంలు ఇరుక్కుంటూనే ఉంటాడు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వర్మ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా గా సెటైర్లు వేస్తూ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు టిడిపి పార్టీ బ్రేకులు సంగతి తెలిసిందే. మార్చి 29 న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నికల తరువాత మే 1కి వాయిదా పడింది.కానీ తాజాగా మళ్లీ ఈ చిత్రానికి ఆటంకం ఎదురయింది. సినిమా విడుదల చేస్తే లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు వస్తాయని సినిమాని ఏపీలో విడుదల చేయనివ్వడంలేదని సోషల్ మీడియా ద్వారా వర్మ వాపోయిన సంగతి తెలిసిందే. ఈసారి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడిపై కూడా సెటైర్లు వేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా వర్మ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో ఒక పక్క హిట్లర్ ఒక చిన్న పాప చెవులు లాగుతూ కనిపించగా మరోవైపు నరేంద్ర మోడీ కూడా ఒక బాబు చెవులు లాగుతూ కనిపించారు. దీనికి 'సేమ్ టు సేమ్' అని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసిన వర్మ ఇండైరెక్టుగా బిజెపి లీడర్ లపై సెటైర్లు వేశాడు.


లైవ్ టీవి


Share it
Top