RGV Murder Movie : దర్శకుడు వర్మకి షాక్... మర్డర్ మూవీకి బ్రేక్!

RGV Murder Movie : లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్ లకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.. కానీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం

Krishna
Published on: 24 Aug 2020 4:30 PM IST
RGV Murder Movie : దర్శకుడు వర్మకి షాక్... మర్డర్ మూవీకి బ్రేక్!
X

Murder Movie poster, RGV 

RGV Murder Movie : లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్ లకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.. కానీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు.. ఇప్పటికే మియా మల్కోవాతో క్లైమాక్స్, కరోనా వైరస్, నగ్నం వంటి సినిమాలను విడుదల చేసిన వర్మ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ ప్రేమ కథని సినిమాగా తీయనున్నట్లుగా ప్రకటించాడు. దీనికి 'మర్డర్' అనేది టైటిల్ కాగా 'కుటుంబ కథా చిత్రమ్' అనేది ట్యాగ్‌లైన్

ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ ను కూడా బయటకు వదిలాడు వర్మ... అయితే ఈ సినిమా పైన ప్రణయ్ భార్య అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది.. అంతేకాకుండా నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించింది. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ వర్మ సినిమాని నిర్మించడాని అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపైన తాజాగా విచారణ చేపట్టిన కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపైన వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!

వర్మ బ్రాండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమాని నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ధియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ చిత్రబృందం అనుకుంది..

Krishna

Krishna

Next Story