రూట్ మార్చిన వర్మ ..ఇప్పుడు ఈ రకంగా వార్తల్లోకి ఎక్కాడు

రూట్ మార్చిన వర్మ ..ఇప్పుడు ఈ రకంగా వార్తల్లోకి ఎక్కాడు
x
RGV ( File Photo)
Highlights

వివాదస్పద వాఖ్యలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు దర్శకుడు వర్మ . తన చేయబోయే సినిమా టైటిల్

వివాదస్పద వాఖ్యలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు దర్శకుడు వర్మ . తన చేయబోయే సినిమా టైటిల్ విషయంలోనైనా కానీ, చేసే ట్వీట్ లతో అయిన కానీ వర్మ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ ఈ సారి మరో రకంగా హైలెట్ అవుతూ వార్తల్లోకి ఎక్కాడు వర్మ.. తాజాగా వర్మ తెరకెక్కించిన బ్యూటిఫుల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ముందుగా డ్యాన్సర్ తో కలిసి స్టేజీ ముందు స్టెప్పులేసిన వర్మ ఆ తర్వాత హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి స్టేజ్ పైనా డాన్స్ చేశాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వర్మ విషయానికి వచ్చేసరికి తాజాగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ ఓ సినిమాని తెరకెక్కించాడు వర్మ. విడుదలకి ముందు ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమా అనుకున్నంత విజయాన్నీ అందుకోలేకపోయింది. ప్రస్తుతం అయన బ్యూటిఫుల్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాకి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా, రవిశంకర్‌ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా తర్వాత జార్జిరెడ్డి ఫేం సందీప్ మాధవ్ తో ఓ సినిమాని చేస్తున్నాడు. హైదరాబాదులోని దందాల మీదా సినిమా ఉంటుందని, ఈ సినిమాని శివ సినిమా స్ఫూర్తి అని వర్మ ఇప్పటికే ప్రకటించాడు కూడా.. త్వరలో ఈ సినిమా పట్టలేక్కనుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories