అందుకే అమ్మ వెనుక దాకున్నా : వర్మ

అందుకే అమ్మ వెనుక దాకున్నా : వర్మ
x
Highlights

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే పెద్ద సంచలనం.. ఎప్ప్దుడు ఎం చేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ ఎం చేసిన కాస్తా వెరైటీగా చేయడం వర్మ స్టైల్. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వర్మ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందిస్తూ కాంట్రవర్సీకి తెరలేపుతారు.

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే పెద్ద సంచలనం.. ఎప్ప్దుడు ఎం చేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ ఎం చేసిన కాస్తా వెరైటీగా చేయడం వర్మ స్టైల్. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వర్మ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందిస్తూ కాంట్రవర్సీకి తెరలేపుతారు.. ఇక ఇదిలా ఉంటే తాజాగా దీపావళి వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నాడు వర్మ.. తన సోదరి, అమ్మతో కలిసి తన ఇంటి ముందు టపాసులు పేల్చాడు వర్మ.

ఈ క్రమంలో వర్మ సోదరి చిచ్చుబుడ్లు కాలుస్తున్న సమయంలో వర్మ తన అమ్మ వెనుక దాక్కొని ఉన్నారు. ఈ వీడియోని ట్విట్టర్ లో వర్మ పోస్ట్ చేస్తూ.. నేను సాధారణంగా చాలా పిరికివాడిని. అందుకే తల్లి వెనుకన దాక్కున్నాను అని రాసుకొచ్చాడు.. అయితే ఆ తర్వాత వర్మే స్వయంగా చిచ్చుబుడ్లు కాల్చాడు. ఈ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ దీపావళి సందర్భంగా వాయు,శబ్ధ కాలుష్యానికి నా వంతు సహకారం ఆందిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక మరో వీడియోని పోస్ట్ చేస్తూ.. 'దీపావళి సందర్భంగా వోడ్కా రుచి చూడమని నా తల్లి, సోదరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా' అని తన తల్లి, సోదరిలతో కలిసున్న ఫోటోను పోస్ట్ చేశారు వర్మ.



Show Full Article
Print Article
Next Story
More Stories