RGV Murder Movie : వర్మ 'మర్డర్ ' కు ఊరట

RGV Murder Movie : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే..

Krishna
Published on: 25 Aug 2020 6:20 PM IST
RGV Murder Movie : వర్మ మర్డర్  కు ఊరట
X

RGV Murder Movie

RGV Murder Movie : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మియా మల్కోవాతో క్లైమాక్స్, కరోనా వైరస్, నగ్నం వంటి సినిమాలను విడుదల చేసిన వర్మ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ ప్రేమ కథని సినిమాగా తీయనున్నట్లుగా ప్రకటించాడు. దీనికి 'మర్డర్' అనేది టైటిల్ కాగా 'కుటుంబ కథా చిత్రమ్' అనేది ట్యాగ్‌లైన్..

అయితే ఈ సినిమా పైన ప్రణయ్ భార్య అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది.. అంతేకాకుండా నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించింది. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ వర్మ సినిమాని నిర్మించడాని అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపైన తాజాగా విచారణ చేపట్టిన కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది..

అయితే ఈ కేసును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు వర్మ... దీనిపైన విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో దర్శకుడు రాంగోపాల్ వర్మ, నట్టి కరుణకు ఊరట లభించినట్టు అయింది.

Krishna

Krishna

Next Story