Ravi Teja Vs Ramesh Verma: రవితేజపై ఖిలాడి డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ భార్య షాకింగ్‌ కామెంట్స్‌

Ravi Teja Vs Ramesh Verma: రవితేజపై ఖిలాడి డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ భార్య షాకింగ్‌ కామెంట్స్‌

hmtv Digital Team
Updated on: 13 Feb 2022 8:00 PM IST
Director Ramesh Verma Wife Comments on Hero Ravi Teja | Tollywood News
X

రవితేజపై ఖిలాడి డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ భార్య షాకింగ్‌ కామెంట్స్‌

Ravi Teja Vs Ramesh Verma: డైరెక్టర్‌ రమేష్ వర్మ వైఫ్‌, స్టార్‌ హీరోపై చేసిన కామెంట్స్‌, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రవితేజ వర్సెస్ డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ మధ్య కొన్నాళ్లుగా కోల్డ్‌ వారు కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖిలాడి సినిమా డైరెక్టర్‌ రమేష్‌ వర్మ భార్య రేఖా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో రవితేజను ఉద్దేశిస్తూ చీప్‌ యాక్టర్‌ అంటూ కామెంట్‌ చేశారామే. ఇటీవల ఖిలాడి మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రమేష్‌ వర్మపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు రవితేజ. అవి కాస్తా సటైరికల్‌గా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు రమేష్‌ వర్మ. అంతా బాగానే ఉన్నట్లు వ్యవహరించారు ఈ ఇద్దరూ. కానీ, రవితేజ వ్యాఖ్యలు చూస్తుంటే వారిద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నట్లు అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో రేఖ పోస్ట్‌ చేసిన ఇన్‌స్టా పోస్టులతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రవితేజ, డైరెక్టర్‌పై కాస్తా అసహనం​ ప్రదర్శించాడు.

ఖిలాడీ సినిమాకు సంబంధించి నిర్మాతే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాల్సిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు . అంతకుముందు దర్శకుడు మహర్జాతకుడని, సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతతో కారు కూడా కొనిపించుకున్నాడంటూ సైటిరికల్‌ కామెంట్స్‌ చేశాడు . రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ఖిలాడి సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని డైరెక్ట్‌గా చెప్పేశాడు రవితేజ. ఇలా ఇద్దరి మధ్య చిన్నపాటి కోల్డ్‌వార్ నడుస్తుండగానే రమేశ్‌ వర్మ భార్య చేసిన కామెంట్స్ టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారాయి. గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్‌ యాక్టర్‌ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది అంటూ పోస్ట్ పెట్టారు రేఖావర్మ. ఇది కలకలం రేపింది.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story