First Look Of Arnab Movie : మరో సంచలనానికి తెర తీసిన వర్మ!

First Look Of Arnab Movie : లాక్ డౌన్ వలన మేకర్స్ అందరూ ఖాళీగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా వరుస పెట్టి

Krishna
Published on: 13 Aug 2020 3:46 PM IST
First Look Of Arnab Movie : మరో సంచలనానికి తెర తీసిన వర్మ!
X
First look of Arnab movie

First Look Of Arnab Movie : లాక్ డౌన్ వలన మేకర్స్ అందరూ ఖాళీగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా వరుస పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే నగ్నం, క్లైమాక్స్, పవర్ స్టార్ చిత్రాలను తెరకెక్కించి అర్జీవీ వరల్డ్ ధియెటర్లో విడుదల చేశాడు వర్మ. తాజాగా 'క‌రోనా, మ‌ర్డర్, అల్లు, అర్నాబ్‌‌-ది న్యూస్ ప్రాస్టిట్యూట్‌, డేంజ‌ర‌స్' వంటి సినిమాల‌ను చేస్తున్నట్టుగా ప్రకటించాడు.. ఇక ఇది ఇలా ఉంటే ప్రముఖ జ‌ర్నలిస్ట్‌ అర్నాబ్‌ పై సినిమా చేయ‌బోతున్నట్టు ఇటీవల ప్రక‌టించిన వర్మ తాజాగా సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్టర్‌ను విడుద‌ల చేశాడు ..

ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ అర్నాబ్‌ని వేశ్యతో పోలుస్తూ ప‌లు ట్వీట్లు చేశాడు వర్మ. వేశ్య ఇత‌రుల కోసం త‌న బ‌ట్టలు తీస్తుంది. కానీ ఇత‌ను త‌న‌ని తాను ఆనందం పొందేందుకు ఇత‌రుల దుస్తులు తీస్తాడంటూ ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నాడు.. ఇప్పటి వరకు సినిమా ప్రముఖులు, అండర్ వరల్డ్ డాన్స్, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులపై సినిమాలు తీసుకుంటూ వచ్చిన వర్మ.. తొలిసారి ఒక జర్నలిస్ట్‌‌కు వ్యతిరేకంగా సినిమా చేయబోతుండంతో పెద్ద చర్చకి దారీ తీసింది. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో పలు సినిమాలు తీసి వివాదాలకి కేంద్ర బిందువు అయిన వర్మ ఈ సినిమాతో మరెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి మరి.

Krishna

Krishna

Next Story