Ram Gopal Varma : దిశా ఎన్‌కౌంట‌ర్ : ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ!

Ram Gopal Varma : టాలీవుడ్ సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ వరుస పెట్టి సినిమాలని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే కరోనా వైరస్

Krishna
Published on: 5 Sept 2020 11:41 AM IST
Ram Gopal Varma : దిశా ఎన్‌కౌంట‌ర్ : ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ!
X

Ram Gopal Varma released his latest movie Disha Encounter First Look

Ram Gopal Varma : టాలీవుడ్ సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ వరుస పెట్టి సినిమాలని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే కరోనా వైరస్, నగ్నం, పవర్ స్టార్ చిత్రాలను తెరకెక్కించి రిలీజ్ చేసిన వర్మ తాజాగా కొద్ది సేపటి క్రితం 'దిశ Encounter ' సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఓ స్కూటి, లారీ, ఓ నిందితుడు పరిగెత్తుతూ ఉండడం, ఒకరు గన్ తో గురిపెట్టడం లాంటివి చూపించాడు వర్మ..

రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వర్మ.. నవంబ‌ర్ 26,2019న ఈ దారుణ‌మైన ఘ‌ట‌న జరగగా, న‌వంబ‌ర్ 26,2020న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నట్టుగా వర్మ వెల్లడించాడు. ఫస్ట్ లుక్ తో సినిమా పైన బాగా హైప్ క్రియేట్ చేశాడు వర్మ.. ఇక కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే.. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Krishna

Krishna

Next Story