RGV Next Film Allu : మ‌రో బాంబు పేల్చిన ఆర్జీవీ.. ఈ సారి టార్గెట్‌ 'అల్లు'

RGV Next Film Allu : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాని అనౌన్సు చేశాడు. ఇప్పటికే పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాని..

Krishna
Published on: 2 Aug 2020 1:21 PM IST
RGV Next Film Allu : మ‌రో బాంబు పేల్చిన ఆర్జీవీ.. ఈ సారి టార్గెట్‌ అల్లు
X
RGV (File Photo)

RGV Next Film Allu : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాని అనౌన్సు చేశాడు. ఇప్పటికే పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాని తెరకెక్కించిన వర్మ... అల్లు అనే పేరిట మ‌రో సంచ‌ల‌న‌ చిత్రాన్ని ప్రక‌టించాడు.. ఫిక్షన‌ల్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ మేరకి అయన వరుస ట్వీట్లు చేశాడు వర్మ.. 'జ‌న రాజ్యం' పార్టీని స్థాపించ‌డంతో క‌థ మొద‌లు అవుతుంద‌ని వర్మ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు అల్లు అని పెట్టడానికి కార‌ణాన్ని కూడా వర్మ వెల్లడించారు.

"అల్లు" అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ "అల్లు"తూ వుంటాడు. అని వర్మ వెల్లడించారు. "తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి "అల్లు"డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు" అని వర్మ ట్వీట్ చేశారు.

అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ "అల్లు" అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలోని పాత్రలను కూడా వెల్లడించాడు వర్మ.. ఎ.అర‌వింద్‌, కె.చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎ.అర్జున్‌, ఎ.శిరీష్‌, కె.ఆర్‌.చ‌ర‌ణ్‌, ఎన్.‌బాబు త‌దిత‌రులు ఉంటార‌ని తెలిపారు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీలోని ఎవరి పైనా ఉంటుందో ఇప్పటికే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Krishna

Krishna

Next Story