ప్రభాస్ తో మరో సినిమా ఉంటుంది : రాజమౌళి

ప్రభాస్ తో మరో సినిమా ఉంటుంది : రాజమౌళి
x
Highlights

ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో ప్రభాస్, రాజమౌళి ఒకటి. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన చత్రపతి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు వచ్చాయి. ఛత్రపతి తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తే బాహుబలి దేశంలోనే రికార్డులు బద్దలు కొట్టింది. బాహుబలి చిత్రం తరవాత ప్రభాస్, రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగాయి. అయితే మళ్ళీ ఈ కాంబినేషన్ ఎప్పుడు రీపిట్ అవుతుందో అని అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది. ప్రభాస్ తో మళ్ళీ సినిమా ఎప్పుడు అని రాజమౌళిని అడగగా, దానికి రాజమౌళి స్పందిస్తూ.. వామ్మో మళ్లీ ప్రభాస్‌తో సినిమానా ఇప్పటికే ప్రభాస్ తో బాహుబలి ఐదు సంవత్సారాలు చేశా. మళ్లీ ప్రభాస్ తో అంటే జనాలు తలలు పట్టుకుంటారని రాజమౌళి అన్నారు. ఆ వెంటనే రాజమౌళి నవ్వుతూ.. మంచి కథ దొరికితే కచ్చితంగా ప్రభాస్‌తో మరో సినిమా చేస్తానని అన్నారు. ప్రభాస్‌తో సినిమా చేయడం నాకూ ఇష్టమేనని అన్నారు.

ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories